ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చలు జరపలేము: సునీల్ శర్మ

 

ఆర్టీసీ సమ్మెపై తుది అఫిడవిట్ దాఖలు చేశారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ లను పరిష్కరించలేమని వారితో చర్చలు జరపలేమని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి విచారణ ఈ నెల 18 కి వాయిదా పడింది. ఆ రోజున విచారణ జరగనుంది అయితే ఆర్టీసీ సమ్మె వ్యవహారంపైన ఆర్టీసీ యాజమాన్యం చాలా తీవ్రంగా ఉంది. దీనిపైన పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయని ఒక అఫిడవిట్ ను హై కోర్టులో దాఖలు చేసింది. ఇవాళ మధ్యాహ్నం హై కోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేశారు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ. యూనియన్ నేతలను టార్గెట్ చేస్తూ ఈ అఫిడవిట్ దాఖలైంది. అందులో చాలా కీలకమైనటువంటి అంశాలను పొందు పరిచారు. 

తీవ్రమైన ఆర్థిక నష్టాలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఆర్టీసీని బాగుపరిచేటువంటి  అంశం ఏ విధంగా లేదు. అసలు ఆర్థిక పరిస్థితి బాగ లేని సమయంలోనే యూనియన్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక సమ్మె పేరుతో కార్మికులను ఇబ్బంది కలిగిస్తూ ఆర్టీసీని తీవ్ర నష్టాల్లోకి నెట్టారు అనే విషయాన్ని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని యూనియన్ నేతలు పక్కన పెట్టినప్పటికి మళ్ళీ వాళ్ళు ఏ క్షణంలోనైనా ఆర్టీసీ విలీనం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె అవకాశాలు ఉన్నాయని అఫిడవిట్ లో సునీల్ శర్మ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేవలం ప్రతిపక్షాలతో కలిసి యూనియన్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడంలో గాని ఆర్టీసీని నష్టపరచడంలో వాళ్లు అనేకమైన కుట్రలు పన్నుతున్నారనే  విషయాన్ని కూడా అఫిడవిట్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు.