కచ్చులూరు ప్రమాదాన్ని తలపిస్తున్న కారు ప్రమాదం.......

 

సూర్యాపేట జిల్లాలోని చాకిరాల దగ్గర కాల్వలో పడిన కారు ప్రమాదం కూడా అచ్చం కచ్చులూరు బోటు పరిస్థితిని తలపిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో సికింద్రాబాద్ కు చెందిన అబ్దుల్ రాజేష్, జాన్సెన్, సంతోష్ కుమార్, నరేష్, పవన్ కుమార్ లు ఉన్నారు. వీరంతా అంకుర ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. చాకిరాలలో స్నేహితుడు విమలకొండ మహేష్ పెళ్లి వేడుకలకు హాజరై తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే స్నేహితులంతా రెండు కార్లలో సూర్యాపేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూడా రెండు కార్లల్లో తిరుగు ప్రయాణమైయ్యారు. మరొక కారు రావడం లేదన్న విషయాన్ని గమనించి వెతికిన వాళ్లకి కాలువలో కొట్టుకు పోయిన కారు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కాల్వలో పడిన కారును ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాటర్ కెమెరాలతో కారు ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు.

కచ్చులూరు వద్ద గజ ఈతగాళ్లు కిందకు వెళ్లి రోప్ ను బోటుకు కడితే కానీ వెలికి తీసే పరిస్థితి అక్కడ ఉంది. కానీ ఇక్కడ కారును వెలికి తీసేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. గజ ఈతగాళ్లు కిందకు వెళ్లి రోప్ ని కారుకు కట్టాలి,అప్పుడే కారును బయటకు తీయగలుగుతారు . దీంతో అధికారులకు గజ ఈతగాళ్లను రప్పించి వారి సహాయం కోసం కారును వెలికి తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.


నాగార్జున సాగర్ ఎడమ కాలువలో చాకిరాల వద్ద పడిపోయినటువంటి కారుని వెలికితీత ఆపరేషన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఆరు గంటలుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్ ను వెలికి తీసేందుకు ప్రయత్నాలైతే ముమ్మరం చేస్తున్నారు. కానీ వారు ప్రయత్నాలైతే విఫలమవుతున్నట్టు కనిపిస్తుంది.దీంతో స్థానిక గజ ఈతగాళ్లు కూడా తమ ప్రయత్నాన్ని కొనసాగించేందుకు పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ముగ్గురు యువకులు మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సాయంగా వారితో పాటూ దిగినటువంటి పరిస్థితి నెలకొంది.


అయితే కారును గుర్తించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ రోప్ ని కారుకు కట్టే ప్రయత్నంలో అనేకసార్లు విఫలం అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది.ముఖ్యంగా నీటి వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతోటి కారుకి రోప్ ని కట్టే సమయంలో లాక్ కి కొక్కెం వేయటంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ నుంచి ఐదు వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ ఘటన తర్వాత రెండు వేల ఐదు వందల క్యూసెక్ ల నీటి ప్రవాహం తగ్గించినప్పటి కూడా ఇంకా వరద ఉధృతి అలానే ఉంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఈ రిస్క్యూ ఆపరేషన్ మాత్రం కొంత కష్టదాయకంగా కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మ్మీద ఈ రిస్క్యూ ఆపరేషన్ చూసేందుకు పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది వస్తున్నారు. సాగర్ ఎడమ కాలువ చుట్టూ ఉండే జనం కూడా ఇక్కడకు వచ్చి చేరుకుంటున్న పరిస్థితి చోటు చేసుకుంది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో మరొక రెండు గంటల్లో ఈ కారును వెలికి తీసి ఆ మృతదేహాలను మాత్రం బంధువులకు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో ఎండీఆర్ఎఫ్ బృందం ప్రయత్నం చేస్తున్న ఈ రిస్క్యూ ఆపరేషన్ మొత్తం మీద మరొక అర్ధగంట, గంట సేపు  పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది అది సఫలమవుతుందో లేదో వేచి చూడాలి.