సీబీఐ సిన్హా స్థానంలో దత్తా

 

2జీ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసి ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2జీ కుంభకోణం కేసు పర్యవేక్షణ బాధ్యతలను సీబీఐ అదనపు డైరెక్టర్ రూపక్ కుమార్ దత్తా స్వీకరించారు. ప్రస్తుతం సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానాకి ఆయన ఇన్‌ఛార్జ్‌గా వున్నారు. ఈయన 1981 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. 2జీ కేసు బాధ్యతల నుంచి సిన్హా తప్పుకుని తన తర్వాతి సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో దత్తా తెరమీదకి వచ్చారు. తాను ఈ కేసు విషయంలో ఎలాంటి ఆశ్రిత పక్షపాతానికి పాల్పడటం లేదని సుప్రీంకోర్టును నమ్మించడానికి రంజిత్ సిన్హా తనవంతు ప్రయత్నాలు తీవ్రంగా చేశారు. అయితే సుప్రీం కోర్టు ముందు ఆయన వాదన నిలబడలేదు.