రేవంత్ ను ఓడించటానికి కేసీఆర్ రూ. 100 కోట్లు?

 

తెరాస ప్రభుత్వం,కేసీఆర్,కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయటంలో ముందుంటారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.తాజాగా రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ..నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చింతమడక చీటర్ కేసీఆర్ తనపై కక్ష కట్టారన్నారు. ‘నన్ను ఓడించేందుకు రూ. 100 కోట్ల మూటతో పట్నం ముఠాలను కొడంగల్ పంపించారు’ అని ఆరోపించారు. కొడంగల్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ నమ్మకాన్ని నిలబెడతామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.