ప్రజలు టెన్షన్ పడద్దు... డబ్బులు ఉన్నాయి..


ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు బారులు తీరారు. ఇక ఏటీఎం సెంటర్ల వద్ద పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. అలా ఏటీఎంలో మనీ వేస్తున్నారో లేదో నిమిషాల్లో ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్భీఐ ఓ ప్రకటన చేసింది. కొత్త క‌రెన్సీ నోట్లు దేశ‌వ్యాప్తంగా అన్ని బ్యాంకుల‌కు చేరుకున్నాయ‌ని, క‌స్ట‌మ‌ర్లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది. ర‌ద్దు అయిన పాత రూ.500, రూ.1000 నోట్ల‌ను మార్చుకునేందుకు 50 రోజుల స‌మ‌యం గడువు ఉంద‌ని.. ప్ర‌జ‌లంతా స‌హ‌నంగా ఉండాల‌ని, డిసెంబ‌ర్ 30 లోపు త‌మ‌కు వీలైన‌ప్పుడు పాత నోట్ల‌ను ఎక్స్‌చేంజ్ చేసుకోవ‌చ్చు అని రిజ‌ర్వ్ బ్యాంక్ వెల్ల‌డించింది.