విశాఖ నుంచి విజయవాడకు మార్పు... జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం...

మూడు రాజధానుల నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ కేపిటలైన విశాఖలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని మొదట జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో బిల్లు ఆమోదం పొందకముందు నుంచే వైజాగ్ లో రిపబ్లిక్ సెలబ్రేషన్స్ కు ఏర్పాటు జరుగుతున్నాయి. GNరావు కమిటీ రిపోర్ట్ సమర్పించిన నాటి నుంచే విశాఖలో గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు అనధికారికంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా అధికారులు ఆ మేరకు ఏర్పాట్లూ చేస్తూ వచ్చారు. అయితే, మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాతే సడన్ గా వెన్యూను జగన్ ప్రభుత్వం మార్చేసింది. రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని నిర్ణయించింది. అంతేకాదు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, మొదట విశాఖలో గణతంత్ర వేడుకలు చేయాలనుకున్న జగన్ ప్రభుత్వం.... ఇప్పుడు ఇంత సడన్ గా వేదికను ఎందుకు విజయవాడకు మార్చిందనేది చర్చనీయాంశంగా మారింది.