గాలిలో 800 మంది విద్యార్థుల భవిష్యత్‌

posted on: Aug 9, 2012 11:41AM

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని 800మంది విద్యార్థుల భవిష్యత్తుతో విద్యాశాఖాధికారులు చెలగాటమాడుతున్నారు. నగరంలోని ఆర్యాపురంలో గతేడాది చివరలోనే శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ను మూసేశారు.

 

 

ఇందులో చదువుతున్న 800మంది విద్యార్థులకు ఇతర స్కూళ్లలో ప్రవేశం కల్పించే చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి విద్యాశాఖాధికారులు చేతులు దులుపుకున్నారు. అప్పుడే ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై త్రైమాసిక పరీక్షలు దగ్గరపడుతున్నా ఇంకా విద్యాశాఖాధికారులు విషయం తేలుస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ విద్యాశాఖాధి కారులు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. ఈ టెక్నో స్కూలుకు సమీపగ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. బస్సులో స్కూలుకు వచ్చి చదువుకుని తిరిగి వెళ్లేవారు. అటువంటిది విద్యాశాఖాధికారులు తేల్చిన తరువాత స్కూలు ప్రవేశం పొందవచ్చని విద్యార్థులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకూ విద్యాశాఖాధికారులు ఈ విద్యార్థుల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించుకున్నారు. కలెక్టరు నీతూకుమారి ప్రసాద్‌ విద్యార్థుల సమస్యలను సీరియస్‌గా తీసుకుంటారని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...