గ్యాస్‌సరఫరాలో కేంద్రమే ఆంధ్రాకు అన్యాయం చేసిందా?

posted on: Aug 6, 2012 5:02PM

ఎవరైనా ఒకరిని రక్షించాలంటే తాను సురక్షితంగా ఉండాలన్న సూత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందంటున్నారని విశ్లేషకులు. రాష్ట్రంలో గ్యాస్‌ఆథారిత విద్యుత్తుప్లాంటులకు సరఫరా చేయాల్సిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరికి తరలించటం వెనుక తనను తాను కాపాడుకునే నైజం ఉందని వెలుగులోకి వచ్చింది. వాజ్‌పేయి అథికారంలో ఉన్నప్పుడు రత్నగిరి గ్యాస్‌ ఆథారిత విద్యుత్తు ఒప్పందం జరిగింది. అప్పుడు అంతర్జాతీయ ఒప్పందం కాబట్టి ఈ ప్లాంటుకు అవసరమైన గ్యాసు సరఫరా చేస్తామని, ఒక వేళ సరఫరా చేయలేకపోతే గ్యారెంటీ కోసం నష్టాలను సైతం భరిస్తామని కేంద్రం గ్యారెంటీ ఇచ్చింది. ఒకవేళ కోరిన గ్యాసు సరఫరా చేయకపోతే రత్నగిరి సంస్థ నష్టాలను కేంద్రం భుజాలపై మోయాల్సి ఉంటుంది.



ఈ ఒప్పందం తరువాత 2008 నుంచి దాని ప్రభావం కేంద్రంపై పడిరది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు మరో 7గురితో కలిసి కమిటీగా వెళ్లి అక్కడి పరిస్థితి సమీక్షించారు. దీంతో గ్యారెంటీ ప్రతిపాదన ఆథారంగా రత్నగిరి  విద్యుత్తుప్లాంటు ఏర్పాటైంది. ఆ సంస్థ కోరితే పూర్తిస్థాయి గ్యాస్‌ను సరఫరా చేస్తామని అప్పటి కేంద్ర మంత్రి మరళీదేవ్‌రా హామీ ఇచ్చారు. వాస్తవానికి కేజీబేసిన్‌ నుంచి ఆంథ్రప్రదేశ్‌లో విద్యుత్తు అవసరాలకు 3.48ఎంఎంఎస్‌సిఎండి గ్యాసు సరఫరా అవుతోంది. ఇప్పుడు దానిలో 2ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మహారాష్ట్రకు సరఫరా చేయనున్నారు. అంటే 1.48ఎంఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మాత్రం రాష్ట్రవాటాగా సరఫరా అవుతుంది. ఎలాగూ గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు కాబట్టి ఆంథ్రప్రదేశ్‌కు అవసరమైన విద్యుత్తును ఆ ప్లాంటు ద్వారా సరఫరా చేయాలని కోరితే బాగుంటుందని సూచనలు వస్తున్నాయి. ప్రథానిని కలిసిన ముఖ్యమంత్రి ఈ తరహా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...