నీటి విడుదల సమంజసం కాదు : దానం

posted on: Jul 6, 2012 6:33PM

డెడ్ స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేయడం బాచావత్ కమిటీ నిబంధనలకు విరుద్ధమని మంత్రి దానం నాగేందర్ అన్నారు.ఇలాగైతే హైదరాబాద్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తపరిచారు. ఇప్పటికే హైదరాబాద్‌లో నీటి కొరత తీవ్రంగా ఉందని దానం పేర్కొన్నారు. దీనిపై తాను, మంత్రి ముఖేష్ కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ ఇచ్చినట్లు దానం తెలిపారు. డెల్టాకు నీటి విడుదల సమంజసమేనన్న జానా వ్యాఖ్యలను మంత్రి దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. అటు మెడికల్ సీట్ల కేటాయింపుపైనా దానం మండిపడ్డారు. మెడికల్ సీట్లు ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని ఆరోపించారు. లగడపాటి, జానారెడ్డి హైదరాబాద్‌లో అన్ని ప్రాంతావారున్నట్లు గుర్తించాలని ఆయన హితవు చేశారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...