మళ్ళీ లాభాలబాటలో ఆర్.టి.సి. ?

posted on: Jun 14, 2012 11:40AM

నాలుగువేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. కట్ అండ్ జనరేట్ పాలసీతో ముందుకు వస్తోంది. దేనివల్ల నష్టం వస్తోందో దాన్ని కట్ చేయటానికీ, ఎక్కడ ఆదాయం వచ్చే అవకాశం ఆగిపోతోందో అక్కడ జనరేట్ చేయటానికీ ఆర్టీసీ నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కొత్త చైర్మన్ ఎ.కె.ఖాన్ సిద్ధంగా ఉన్నారు. తన పోలీసు బుర్రకు ఆయన పదునుపెట్టి నష్టాలు పూడ్చేందుకు తనవద్ద ప్లానుందంటున్నారు. అంతే కాకుండా రీజనల్ మేనేజర్ లు, డిపో మేనేజర్లు తమ పరిథిలో నష్టాలు తగ్గించుకోవాల్సిన అవసరముందన్నారు. ముందుగా రోజుకు వస్తున్నా రెండుకోట్ల రూపాయల నష్టాన్ని భర్తీ చేస్తామన్నారు. ఆ తరువాత లాభాలబాటలోకి తీసుకువెడతామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే పెరిగిపోయిన అప్పులు ఒక ఆర్టీసీ కార్మికుని తలపై మూడు లక్షల రూపాయల భారంగా ఉన్నందున కొత్త అప్పులకు వెళ్ళబోమన్నారు. మళ్ళీ కొత్త అప్పులకు వెళ్ళకుండా మెయింటనెన్స్ ఎలానో ఖాన్ నిర్వహణలోనె తెలుస్తుంది కదా అదేనండీ తినబోతూ రుచి ఎందుకని కార్మికులు ఎదురుచూస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...