Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కడప 'దేశం'పై కన్నేసిన జగన్
posted on: May 19, 2012 12:24PM
గెలుపుకోసం నేనెంత దాకా అయినా తెగిస్తానన్న శ్రీమహాలక్ష్మి సినిమాలోని శ్రీహరి డైలాగు అచ్చుగుద్దినట్టు అమలు చేస్తున్నారు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సొంతజిల్లా అయినందున కడపలో ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపుకోసం అడుగడుగు నా వ్యూహం మార్చుకుంటూ పోతున్నారు. ఇప్పటిదాకా ఇతరపార్టీల్లో ఉన్న ద్వితీయ కేడర్ ను ఎలా ఉపయోగించు కోవాలనే అంశంపై దృష్టి పెట్టిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అసంతృప్తితో ఉన్న నేతల వివరాలను సేకరించింది. ఈ జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నందున ఈ మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తితో ఉన్న నాయకుల జాబితాలను దగ్గర పెట్టుకున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరితోనూ విడివిడిగా చర్చలు జరుపుతోంది.
ముందస్తుగా రైల్వేకోడూరు టిక్కెట్టు ఆశించిన ఎంపి సాయిప్రతాప్ అనుచరుడు, 2004-2009 వరకూ ఎమ్మెల్యే అయిన గంటి వెంకటేశ్వర ప్రసాద్ ను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. తనకు టిక్కెట్టు ఇవ్వలేదన్న అసంతృప్తితో వున్న ఈయన సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి కలుస్తారని చెప్పినా తనకు ఖాళీ లేదని తప్పించుకున్నారు. ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు సూచించిన కనుపర్తి ఈశ్వరయ్యకు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయమై అసంతృప్తితో గడుపుతున్న వెంకటేశ్వర ప్రసాద్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో జగన్ పర్యటన సందర్భంగా చేరనున్నారు. దీనికి ఏర్పాట్లూ పూర్తియ్యాయి. అలానే ఈయన తరువాత గేలం తెలుగుదేశంపార్టీలోని ఓ ఇద్దరు నేతలకు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వేసిందని సమాచారం. వీరి వివరాలు ఇంకా ఆ పార్టీ బయటపెట్టలేదు. ప్రసాద్ చేరికతో తమ పార్టీ రైల్వేకోడూరులో బలపడుతుందని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


.png)



