గోవాలో సూరి, భాను మధ్య గొడవను పరిష్కరించిన వర్మ

posted on: May 19, 2012 11:47AM

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్ గన్‌మెన్ మధుమోహన్ సిఐడి అధికారులు రెండు రోజుల పాటు విచారించారు. సూరి హత్యకు ముందు భాను కిరణ్, సూరి గోవాలో బస చేసినట్లు తెలుస్తోంది. వారితో పాటు దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ, ఇద్దరు హీరోయిన్లు, ఓ ప్రముఖ హీరో ఉన్నట్లు చెబుతున్నారు. గోవాలోనే భానుకు, మద్దెలచెర్వు సూరికి మధ్య ఘర్షణ చెలరేగినట్లు మధుమోహన్ చెప్పినట్లు సమాచారం. భాను తలకు సూరి తుపాకి గురిపెట్టి బెదిరించినట్లు అతను సిఐడికి చెప్పినట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య గొడవను రామ్ గోపాల్ వర్మ పరిష్కరించాడని కూడా వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మను ఈ విషయంలో సిఐడి అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...