కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్

posted on: Feb 22, 2012 11:00AM

హైదరాబాద్: తెలంగాణ కోసమంటూ ఇక నుండి ఎవరూ రాజీనామా చేయవద్దని, అలా చేస్తే భవిష్యత్తులో తాము మద్దతిచ్చే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం షాక్ ఇచ్చారు. సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రస్తుతం రాజీనామా చేసిన వారు తెలంగాణ కోసమే చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అందుకే తాము పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇక నుండి రాజీనామాలు అంటే మాత్రం తమ మద్దతు ఉండదని చెప్పారు. తమ నుండి టిఆర్ఎస్ విడిపోతే బిజెపిలో కలవడానికి ఆ పార్టీ నేతలు చాలామంది వరుసలో ఉన్నారని చెప్పారు. స్టేషన్ ఘనపూర్‌లో తమ పార్టీ పోటీ చేస్తే టిఆర్ఎస్ పని ఖతమన్నారు. తెలంగాణపై తమ పార్టీ నిర్ణయం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అలాంటప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరమేమిటన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...