|
|
యానాంఘర్షణలలో కార్మిక నేత,వైస్‌ఛైర్మన్ మృతి
యానాం:కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పరిధిలోని యానాంలోని రీజెన్సీ సిరామిక్ యాజమాన్యానికి, కార్మికులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇవి హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. కార్మిక సంఘ నేత మురళీమోహన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆయన కన్నుమూశారు. దీనికి నిరసనగా కార్మికులు యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. దీంతో యాజమాన్యానికి, కార్మికులకు మధ్య హింస చెలరేగింది.ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ నాయకుడి మృతిని తట్టుకోలేక కార్మికుల ఫ్యాక్టరీ వైస్ ఛైర్మన్‌పై దాడి చేసి విధ్వంసానికి దిగారు. కంపెనీ బస్సులకు, లారీలకు నిప్పు పెట్టారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది కార్మికులు గాయపడ్డారు. గత మూడు నెలలుగా రీజెన్సీ యాజమాన్యానికి కార్మికులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. జీతాల పెంపుదలను కోరుతూ పదిరోజులుగా వీరు రిలేనిరాహార దీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఇరువర్గాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు.కార్మికుల దాడిలో గాయపడ్డ రీజెన్సీ సిరామిక్ సంస్థ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు కార్మికులు యానాంలోని రహదారులు దిగ్బంధించి ఆందోళనకు దిగారు. యానాంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాకినాడ నుంచి అదనపు పోలీసు బలగాలు యానాంకు తరలించారు.
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
- India Vs Sri Lanka Brisbane ODI: Latest...
- Major Fire in Medchal Slum Area: 7 Dead
- Jagan MLA Pilli Subhash Chandra Bose Res...
- Yanam Violence: Jail Filled up With Deta...
- Major Fire in a Hyderabad Hotel: 1 Dead,...
- Telangana Employees to go on Strike Agai...
- Policeman identified in Jarawa video sus...
- Manoj Murder: 2 Crore Worth Jewelry Reco...


