అది ఆజాద్ జాదూనే..!

 

కేంద్ర తెలంగాణ విష‌యంలో స్పష్టమైన వైఖ‌రితో ఉంది అన్న వాద‌న బ‌లంగా వినిపిస్తున్న నేప‌ధ్యంలో ఇప్పుడు సీమాంద్ర నాయ‌కుల నుంచి కొత్త వాద‌న వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న పరిణామాల‌న్నింటి వెనుక కేంద్రలోని ముఖ్య నాయకుడు ఆజాద్ హ‌స్తం ఉన్నట్టుగా ఆరోపిస్తున్నారు ప‌లువురు నేత‌లు..

గ‌తంలో ఆంద్రప్రదేశ్ ఇంచార్జ్‌గా వ్యవ‌హారించిన స‌మ‌యంలో కూడా ప‌లు వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో తెలంగాణ‌తో పాటు రాష్ట్రంలో విద్వేశాల‌ను రెచ్చగొట్టిన ఆజాద్ మ‌రోసారి తెరవెనుక త‌తంగా న‌డిపిస్తున్నార‌న్న వాద‌న ఉంది.. ఆజాద్ వ‌ల్లే అస‌లు ఎవ‌రు కోర‌ని రాయ‌ల్ తెలంగాణ అంశం తెర మీద‌కు వ‌చ్చింది అంటున్నారు.

ప్రత్యేఖ తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఎం ఐ ఎం పార్టీ అస్తిత్వంమే ప్రశ్నార్ధకం అవుతుంది అందుకే తొలినుంచి ఆ పార్టీ విభ‌జ‌న‌ను వెతిరేఖిస్తూ వ‌స్తుంది.. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ దూరంగా ఉన్న ఎం ఐ ఎం పార్టీ ఆజాద్ తోక‌లిసి ఈ నాట‌కం ఆడిస్తున్నట్టుగా చెపుతున్నారు.. రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఉన్న ముస్లింల‌తో క‌లిపితే కొత్త గా ఏర్పడే రాష్ట్రంలో ముస్లిం శాతం ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఆజాద్ ఈ ప్రతిపాతద‌న తెచ్చిన‌ట్టుగా చెపుతున్నారు..