ప్రేమించా...పెళ్లి వరకు వెళ్లా...కానీ... రతన్ టాటా ప్రేమకథ...

టాటా సన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా రతన్ టాటా చెప్పిన తన రియల్ లవ్ స్టోరీ కావడంతో నెటిజన్లు విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఫేస్ బుక్ పేజీలో తన ప్రేమ కథను పంచుకున్న రతన్ టాటా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా లాస్ ఏంజెల్స్ లోని కార్నెల్ వర్సిటీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగించినట్లు తెలిపారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వ‌ర‌కు త‌మ రిలేష‌న్ వెళ్లింద‌న్నారు. అయితే, ఆ స‌మ‌యంలో త‌న‌ బామ్మ ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఇండియాకు తిరిగి వ‌చ్చాన‌ని, అదే స‌మ‌యంలో ఇండో చైనా యుద్ధం జ‌ర‌గ‌డం వ‌ల్ల ప‌రిస్థితులు తారుమారైన‌ట్లు చెప్పారు. త‌న‌తోపాటు ఇండియాకు తన ప్రేయసి వస్తుందని భావించానని, కానీ యుద్ధం నేప‌థ్యంలో ఆ అమ్మాయి పేరెంట్స్ ఆమెను ఇండియాకు పంపేందుకు నిరాక‌రించిన‌ట్లు ర‌త‌న్ చెప్పారు. ఆ కార‌ణంగానే రిలేష‌న్ తెగిపోయింద‌న్నారు.  

రతన్ టాటా తన లవ్ స్టోరీతోపాటు తన బాల్యం, అలాగే తన కుటుంబ పరిస్థితుల గురించి నెటిజన్లతో పంచుకున్నారు. దాంతో, క్షణాల్లో అవి వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు అయితే, దేశం మీకు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటోంది... అంటూ కామెంట్స్ చేస్తున్నారు.