అరగంటలోనే ఫలితాలు..

యాంటీ జెన్ పరీక్షలు..
పిహెచ్ సిలోనూ అందుబాటులో..
ప్రసవానికి పదిరోజుల ముందు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలను వైద్యఆరోగ్య శాఖ చేస్తోంది. అరగంటలోనే ఫలితాలిచ్చే యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ రోగులను త్వరగా గుర్తించేందుకు సన్నద్దమైంది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఒక్కోక్క సెంటర్ లో 25మందికి మాత్రమే పరీక్షలు చేస్తారు. ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లోని జిహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానల్లో ఈ పరీక్షలు చేస్తున్నారు. తర్వలోనే రాష్ట్రవ్యాప్తంగా యాంటీజన్ పరీక్షలు నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు.

అరగంటలోనే..
మామూలుగా కరోనా నిర్ధారణ కోసం రియల్టైం ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమర్స్ చైన్ రియాక్షన్) పరీక్ష చేస్తారు. అదే మాదిరిగా యాంటీ జెన్ పరీక్షల్లోనూ ముక్కు, గొంతు కలిసే చోట (నాసో ఫారింజియల్ రీజియన్) నుంచి స్వాబ్లతో శాంపిళ్లను తీసుకుంటారు. సేకరించిన శాంపిళ్లను అక్కడిక్కడే పరీక్షించి అరగంటలోనే ఫలితం చెప్పారు. అయితే ఆర్టీపీసీఆర్‌లో వైరస్ జీన్ను గుర్తిస్తే.. ఈ యాంటీజెన్ టెస్టులో వైరస్ ప్రొటీన్ను గుర్తిస్తారు. ఈ పరీక్షలో పాజిటీవ్ వస్తే 84 నుంచి 99శాతం వారి శరీరంలో వైరస్ ఉన్నట్లే నిర్ధారిస్తారు. నెగిటివ్ వచ్చిన వ్యక్తిలో కరోనా లక్షణాలు ఉంటే అప్పుడు ఆర్టీపీసీఆర్ పద్దతిలో పరీక్షలు చేస్తారు.

శరీరంలో 14 రోజులు యాంటీజెన్ ప్రోటీన్..
కోవిద్ వైరస్ సోకిన తర్వాత పది నుంచి 14 రోజుల పాటు యాంటీజెన్  ప్రొటీన్ ఆ వ్యక్తి శరీరంలో ఉంటుంది. లక్షణాల్లేని పేషెంట్లలో పది రోజుల వరకు, లక్షణాలు కనిపించే వారిలో 14 రోజుల వరకూ యాంటీజెన్ ప్రోటీన్ ఉంటుందని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ వివరిస్తున్నాయి.

అన్నీ హాస్సిటల్స్ లో..
కరోనా తీవ్రతను అరికట్టాలంటే పరీక్షలు ఎక్కువగా చేస్తూ పాటిజివ్ వ్యక్తులను గుర్తించి వారిని క్వారంటైన్ చేయాలి. వైరస్ వ్యాప్తిని ఈ విధంగా అరికట్టడం సాధ్యమవుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేటెడ్ హాస్పిటల్స్(ఎన్ఏబీహెచ్) అన్నింటికీ ఈ టెస్టులు చేసే అవకాశం ఇవ్వాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

ప్రసవానికి పదిరోజుల ముందు..
కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ అవసరమే. అయితే ముందుగా కంటెయిన్మెంట్ జోన్లలో ఉన్నవారికి, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణీలకు ప్రసవానికి పదిరోజుల ముందు ఈ పరీక్ష తప్పనిసరిగా చేయాలి. ఈ పరీక్షతో పాజిటివ్ వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది.