కొత్త పార్టీని స్థాపించే ఆలోచనే లేదు : రజనీకాంత్

 

 

  

తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. రాజకీయాలంటే నిరాసక్తత వ్యక్తం చేసిన ఆయన, ఆ రంగంలో తనకు ప్రత్యేకంగా లక్ష్యాలేమీ లేవని అన్నారు.

 

కొంత మంది రజని అభిమానులు ఇటీవల ఆయనను కలిసి తమిళ రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషించాలని కోరిన విషయం తెలిసిందే. దీని ఫై ఆయన వ్యాఖ్యానిస్తూ, తాను నేతగా పనికి రానని, తన వ్యక్తిత్వంలో నాయకుడు లేదని కుండ బద్దలు కొట్టారు.

 

తాను ఈ స్థాయిలో ఉండడానికి తమిళ నాడు ప్రజలే కారణమని, వారికి తానెప్పుడూ ఋణపడి ఉంటానని రజనీకాంత్ అన్నారు. మూడు రోజుల క్రితం 63 వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఆయన, గతంలో జి.కే. మూపనర్ పార్టీకి మద్దతు పలికి, ఆ పార్టీ అధిక సీట్లు గెలవడానికి సహాయపడ్డారు.