పతాంజలి బ్రాండ్ అంబాసిడర్ గా లాలూ..

Publish Date:May 4, 2016

 

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పతాంజలి బ్రాండ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాందేవ్ బాబానే తెలిపారు. లక్నోలో లాలూ ప్రసాద్ ను కలిసిన సందర్భంగా.. రాందేవ్ బాబా మాట్లాడుతూ పతంజలిఉత్పత్తులకు లాలూను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ఆయన పతంజలి గోల్డ్ ఫేస్ క్రీమ్ ను లాలూ ముఖానికి ఆయన పూశారు.

 

ఈ సందర్భంగా లాలూ మాట్లాడుతూ..  అనంతరం లాలూ మాట్లాడుతూ, పతంజలి ఉత్పత్తులకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని అన్నారు. పతంజలి ఉత్పత్తులను చూసి ప్రముఖ సంస్థలు అసూయ చెందుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఉత్పత్తుల ద్వారా బాబారాందేవ్ దేశానికి సేవ చేస్తున్నారని ఆయన తెలిపారు.

By
en-us Politics News -