‘సంపద’ చూపించిన రాఖీ సావంత్!

 

 

 

బాలీవుడ్ సూపర్ హాట్ గర్ల్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాఖీ సావంత్ ఈ ఎలక్షన్స్ లో వాయవ్య ముంబై లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తోంది. ఈ ఎన్నికలలో పోటీ చేయడం కోసం ‘రాష్ట్రీయ ఆమ్ పార్టీ’ (రేప్)ని స్థాపించింది. హాట్ గర్ల్ అయిన తన ఎన్నికల గుర్తు కూడా హాట్ హాట్‌గా వుండాలన్న ఉద్దేశంతో తనకి పచ్చి మిరపకాయని గుర్తుగా కేటాయించాలని ఎలక్షన్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా వుంటే, ఎలక్షన్లలో పోటీ చేసేవారు తమ ఆస్తులను బహిర్గతం చేయాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాఖీ సావంత్ తన ఆస్తులను బయటపెట్టింది.

 

రాఖీ సావంత్ ఆస్తి మొత్తం 14 కోట్ల 69 లక్షలు. వీటిలో 3 కోట్ల 57 లక్షలు చరాస్తులు, 11 కోట్లు 12 లక్షలు స్థిరాస్తులు. ఆమె దగ్గర ప్రస్తుతం చేతిలో వున్న డబ్బు 96,427 రూపాయలు. 39 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో వున్నాయి. 61 లక్షలు బాండ్స్, షేర్స్ రూపంలో వున్నాయి.

2 కోట్ల 12 లక్షలు ఇన్సూరెన్స్, పోస్టల్ సేవింగ్స్ వున్నాయి. 21 లక్షల విలువైన ఫోర్డ్ ఎండీవర్ కారు వుంది. ముంబైలో ఒక ఫ్లాట్ వుంది. ఆస్తుల వివరాలు ఇలా వుంటే, ఈ అమ్మడి మీద ఒక ఛీటింగ్ కేసు కూడా వుంది. అందాలు ఆరబోయడం ద్వారానే ఇన్ని కోట్లు సంపాదించిన రాఖీ సావంత్ అస్సలు చదువుకోలేదట. ఎన్నికల డిక్లరేషన్‌లో తాను నిరక్ష్యరాస్యురాలినని రాఖీ సావంత్ పేర్కొంది.