రాజ్‌నాథ్ సింగ్‌కి తీవ్ర అస్వస్థత

 

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. రాజ్‌నాథ్ సింగ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. రాజ్‌నాథ్ సింగ్‌ను ఐసీయూలో ఉంచి వైద్యుల బృందం చికిత్స చేస్తోంది. రాజ్నాథ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ఎలా వుందనే విషయం ఇప్పుడే చెప్పలేమని వైద్యులు అంటున్నారు.