క్లారిటీ ఇచ్చిన కబాలి.. కమల్ తో సమావేశం.. డిసెంబర్ 12న పార్టీ ప్రకటన

 

పొలిటికల్ పార్టీ ఏర్పాటు పై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు. అన్నీ కుదిరితే డిసెంబరు 12 న ప్రకటన రావచ్చు. వచ్చే ఏడాదే రాజకీయ పార్టీ ప్రారంభం కావచ్చు. స్వయంగా రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్ కమల్ చెప్పిన మాటలివి. రాజకీయ అరంగేట్రంపై తలైవకు క్లారిటీ వచ్చేసింది అని తమిళురువి చెప్పారు. డిసెంబర్ 12 న రజనీకాంత్ పుట్టిన రోజు, అందుకే ఆ రోజున రాజకీయ పార్టీ పై ప్రకటన చేస్తారని సమాచారం. 2021 లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ కొంత ఖుషిగా ఫీలయ్యారు. 

లోక్ సభ ఎన్నికల తర్వాత రజనీ మళ్లీ సైలెంటయిపోయారు. దానితో అభిమానుల్లో మళ్లీ గందరగోళం ఏర్పడింది. అసలు రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారు.. పార్టీ ప్రకటన ఏ రోజు చేస్తారు.. అసలు పార్టీ ఉంటుందా ఉండదా అంటూ ప్రశ్నల వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో తమిళరువి మణియన్ కమల్.. రజనీకాంత్ తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ చర్చించారు. రజినీ రాజకీయ అరంగేట్రం పైనే డిస్కషన్ సాగినట్లు తెలుస్తోంది. మొత్తానకి తలైవా పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. వచ్చే వారం స్వయంగా రజినీకాంత్ ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వచ్చే ఏడాది రాజకీయ పార్టీ నిర్మాణం పై దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మక్కల్ నీది మయ్యమ్ అధినేత నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. రజనీకాంత్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. అయితే కమల్ తో పొత్తు పెట్టుకుంటారా లేదా అన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.