మోదీ క్షమాపణ చెప్పాలి.. రేప్ ఇన్ ఇండియా వివాదంపై వెనక్కి తగ్గని రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ రేప్ ఇన్ ఇండియా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యాఖ్యల పై బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అయితే క్షమాపణలు చెప్పేదిలేదని రాహుల్ స్పష్టం చేశారు. దీంతో ఈసీని కలవాలని నిర్ణయించుకుంది బిజెపి, స్మృతి ఇరానీ నేతృత్వంలోని బిజెపి బృందం ఈసీని కలవనుంది. రాహుల్ వ్యాఖ్యల పై లోక్ సభ దద్దరిల్లింది. దేశానికి క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. అయితే క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ బీజేపీ పై ఎదురు దాడి మొదలు పెట్టారు. క్షమాపణ చెప్పాల్సింది తాను కాదని మోడీనే అని రాహుల్ అన్నారు. గతంలో మోడీ ట్వీట్ చేసిన వీడియోను రాహుల్ రీ ట్వీట్ చేశారు.

2013 ఎన్నికల ప్రచారంలో మోడీ ఢిల్లీని రేప్ క్యాపిటల్ అంటూ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అగ్నిగుండంలా మార్చినందుకు దేశ ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చినందుకు ఢిల్లీని రేప్ క్యాపిటల్ అన్నందుకు మోడీనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్. లోక్ సభ నిరవధిక వాయిదాకు ముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై తీవ్ర దుమారం చెలరేగింది. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపణ చెప్పాలని బిజెపి మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలతో రాహుల్ దేశ ప్రజానీకానికి ఏం సందేశం ఇస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. గతంలో ఏ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె విమర్శించారు.