రాహుల్ గాంధీ ఆస్థానంలో బీజేపీ కోవర్ట్!!

 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా రాహుల్ గాంధీ నమ్మినవారే ఆయన్ను ముంచారా? నమ్మిన వాళ్ళు కాంగ్రెస్ అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులే ఆయనకు తప్పుడు సమాచారం చేరవేశారనే వార్త ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది.

రాహుల్ గాంధీని కొందరు డైవర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ కి పరిస్థితి వచ్చిందని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ 164 నుంచి 184 స్థానాలు ఒంటరిగా గెలుచుకుంటుందని చెప్పారట. ఇది నమ్మిన రాహుల్ పలు యూపీఏ మిత్రపక్ష పార్టీలను కలిశారట. వీరిలో స్టాలిన్, అఖిలేష్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, శరద్ పవార్, తేజస్వీ యాదవ్‌లాంటి వారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ రానున్న కొత్త కేబినెట్‌లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం కాంగ్రెస్ కి ప్రతికూలంగా వచ్చాయి.

ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అత్యంత నమ్మిన వ్యక్తుల్లో ఒకరైన ప్రవీణ్ చక్రవర్తి జాడ కనిపించలేదు. ఆయనే కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ చూశారు. అంతేకాదు సమాచార విశ్లేషణ, శక్తి యాప్ వంటివి కూడా ప్రవీణ్ చక్రవర్తే దగ్గరుండి చూశారు. ఇక ఎన్నికలకు ముందు ఆయన సేకరించిన సమాచారం కలిగి ఉన్న హార్డ్ డిస్క్‌ను కూడా ఆయన ఇవ్వలేదు. వీటంతటికీ అయిన ఖర్చు రూ.24 కోట్లు బిల్లు సమర్పించారు తప్పనిస్తే అసలైన సమాచారం మాత్రం పొందుపర్చలేదు. అయితే ఈయన బీజేపీ కోవర్ట్ అయి కాంగ్రెస్ ఓటమికి కృషి చేశారని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.