రాహుల్ గాంధీకి కూడా పాత నోట్లు మార్పిడి కష్టాలు..

 

పాత నోట్లు మార్పిడి.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పాట్లు సామాన్య ప్రజల నుండి.. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు సైతం తప్పట్లేదు. తాజాగా ఈ పాత నోట్ల తిప్ప‌లు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి కూడా త‌ప్ప‌లేదు. నోట్ల మార్పిడి కోసం ఇవాళ రాహుల్ గాంధీ కూడా బ్యాంకుకు వెళ్లారు. పార్ల‌మెంట్ వీధిలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లగా.. అక్క‌డ భారీగా గుమ్ముకూడిన జ‌నం రాహుల్‌తో త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా క్యూ క‌ట్టి .. పాత నోట్ల‌ను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్ర‌భుత్వం తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నా ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌చ్చింది, వాళ్ల‌కు తోడుగా నేను ఉన్నాన‌ని చెప్పారు.