కాంగ్రెస్ పార్టీకి రాహుకాలం మొదలయినట్లే!

 

తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పజేప్పెందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మార్చి లేదా ఏప్రిల్ నెలలో బెంగళూరు లేదా ఉత్తరాఖండ్ లో జరుగబోయే ఏ.ఐ.సి.సి. మేధోమధన సదస్సులో రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పబోతున్నట్లు సమాచారం. సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుండి దిగిపోయినప్పటికీ, ఆమె పార్టీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించి వెనుక నుండి పార్టీని పర్యవేక్షించబోతున్నట్లుగా తెలుస్తోంది.

 

కాంగ్రెస్ పార్టీలో యువతరానికి అంటే 45 ఏళ్లు దాటిన రాహుల్ గాంధీ వంటివారికి కీలక పదవులు, బాధ్యతలు అప్పగించి, వృద్ధులు అంటే 60 ఏళ్ళు దాటిన తన తల్లి వంటివారిని పక్కనబెట్టబోతున్నట్లు మరో సమాచారం. నిన్న ఐదు రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షుల నియామకం ఆ దిశలో వేసిన తొలి అడుగుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక రాహుకాలం మొదలయినట్లే భావించవచ్చును.