రాహుల్ కి మోడీ చురకలు

 

గుజరాత్ ఎన్నికలలో కాంగ్రెస్ రధసారధిగా వెనుక సీటులో కూర్చొని సారద్యం చేస్తున్న రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ‘ప్రచారం చేయడానికి ఎందుకు రావడం లేదు’ అని సవాల్ విసిరే వరకు గుజరాత్ వైపు తొంగి చూడలేదు. బహుశః ఓటమి ఖాయమని తెలిసీ వెళ్లిపరువు తీసుకోవడం కన్నాఎన్నికలకి దూరంగాఉండి తనచేతికి మట్టిఅంటకుండా ముందు జాగ్రత్త పడుదామనుకుంటే, మోడీ సవాల్తో తప్పనిసరిగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచ్రారంలో పాల్గొనేందుకు గుజరాత్లో అడుగు పెట్టవలసి వచ్చింది రాహుల్ గాంధీకి. ప్రచారం ముగియబోయే ఆఖరిరోజున గుజరాత్లో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ మోడీని ఆయన ప్రభుత్వాన్ని నోరార విమర్శించిన తరువాత, తానూ, తన పార్టీ మహాత్ముని అడుగుజాడలలోనడుస్తున్నామని ముగించి, మోడికి ఒక కొత్త అస్త్రం అందిచేడు. చురకలు వేయడంలో దిట్టగా పేరొందిన నరేంద్రమోడీ అయాచితితంగా దొరికిన ఈ అస్త్రాన్ని మళ్ళీ కాంగ్రేసు మీదకే సందిన్చేడు. “మహాత్ముని అడుగుజాడలలో నడిచేపార్టీ మా కాంగ్రెస్ పార్టీ అని గొప్పలు చెప్పుకొనే మీరు, యఫ్.డి.ఐ.లను బలవంతంగా పార్లమెంట్ చేత ఆమోదింపజేసుకొని మరీ దేశంలోకి విదేశీయుల మార్గం సుగమం చేసేందుకు ఎందుకు అంతగా కష్టపడ్డారు పాపం. ఆనాడు గాంధీగారు విదేశీయులని దేసంలోంచి వేల్లగోట్టేందుకు స్వరాజ్యోద్యమం చేస్తే, ఈనాడు కాంగ్రెస్ విదేశీఉద్యమం చేస్తోందెందుకు? దేశానికి స్వతంత్రం రాగానే కాంగ్రేసుని రద్దు చేయమని మహాత్మా గాంధీగారు గట్టిగా చెప్పినా మీ పార్టీ ఇంకా ఎందుకు నడిపిస్తున్నారు? అంటూ ఎదురు దాడి చేసి రాహుల్ గాంధీకి సుతిమెత్తగా చురకలు అన్టించేడు నరేంద్ర మోడీ.