మెడికోలతో డాన్స్ చేయించిన సర్జన్లు

 

అనంతపురం మెడికల్ కాలేజీలో జూనియర్ మెడికోలను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. శనివారం అర్థరాత్రి సీనియర్ మెడికోలు జానియర్లను ర్యాగింగ్ చేశారు. ఆ ప్రయత్నాన్ని జూనియర్ మెడికోలు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీనియర్లు జూనియర్ల దుస్తులు విప్పించి డాన్సులు చేయించారు. దాంతో బాధితులు సహచర విద్యార్థులతో కలసి కాలేజీ ఉన్నతాధికారులకు ర్యాగింగ్పై ఫిర్యాదు చేశారు. దాంతో కాలేజీ ప్రిన్సిపల్ విచారణ చేపట్టారు. ర్యాగింగ్‌కి బాధ్యులైన నలుగురు హౌస్ సర్జన్లను విధుల నుంచి ప్రిన్సిపల్ తప్పించారు.