మరొకళ్ళని కనండి

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నీమధ్య మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనాలని అన్నప్పుడు విమర్శించడమే పనిగా పెట్టుకున్నవాళ్ళు నోళ్ళు నొక్కుకున్నారు. కానీ, ఆయన చెప్పినది నూటికి నూరుశాతం సమర్థనీయమైన అంశం. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఒక్కరితో సరిపెట్టుకునే ధోరణి వల్ల ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. జపాన్, చైనా లాంటి దేశాల్లో ఎటు చూసినా ముసలీ ముతకా కనిపిస్తున్నారు తప్పితే యువతరం కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇటీవల సేమ్ టు సేమ్ చంద్రబాబు నాయుడు చేసిన తరహా ప్రకటనే చేశాడు. అమెరికా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటోంది. చైనాలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణం. దాంతో కళ్ళు తెరిచిన చైనా ప్రభుత్వం ఏనాడో అమల్లోకి తెచ్చిన ‘ఏకైక సంతానం’ విధానాన్ని 2013 సంవత్సరంలో రద్దు చేసింది. చైనాలోని షాంఘైలో తాతయ్యలు, బామ్మలే తప్ప కష్టించి పనిచేసే కుర్రకారు కనిపింపడం లేదు. దాంతో షాంఘై అధికారులకు ‘కను’విప్పు కలిగింది. వీలున్నవాళ్ళు మరో సంతానం కోసం సిన్సియర్‌గా ట్రై చేయండంటూ ఆదేశాలు జారీ చేసింది.