ద్వారంపూడీ... నీది నోరా? పంది బురదా?

పక్కనే మహిళా ఎంపీ ఉన్నారనే స్పృహ లేదు. కనీసం తానొక ఎమ్మెల్యేనన్న సంగతి కూడా మర్చిపోయాడు. పబ్లిక్ లో మాట్లాడుతున్నాను... ప్రజలందరూ వింటున్నారనేదీ విస్మరించాడు. పంది బురద మాదిరిగా ఇంకితం కూడా లేకుండా చెలరేగిపోయాడు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. రౌడీలు, పోకిరీలు, ఆవారాగాళ్లు, తాగుబోతులు, చిల్లరగాళ్లు సైతం సిగ్గుపడేలా నోటికి హద్దూ అదుపూ లేకుండా పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి, తెలుగు రాష్ట్ర రాజకీయాలతోపాటు ఇండియన్ పాలిటిక్స్ లోనే కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తన తండ్రిలాంటివాడు... 70ఏళ్లు వయసున్న పెద్దమనిషనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా బూతులతో చెలరేగిపోయాడు. రాయలేని భాషలో... అసలేమన్నాడో చెప్పలేనివిధంగా చంద్రబాబుపై నోరు పారేసుకున్నాడు ద్వారంపూడి. (ల-జ-కొడకా, ఎధవా, దొంగనా కొడకా-అంటూ) పందులు సైతం సిగ్గుపడేలా నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ముసలోడు మళ్లీ లెగకూడదు... ఆ ఎదవను కొట్టాలని ఉందంటూ తాగుబోతు మాదిరిగా రెచ్చిపోయాడు. ద్వారంపూడి మాటలకు పక్కనే ఉన్న మహిళా ఎంపీ వంగా గీత సైతం అవాక్కై... నోటిపై చేయి అడ్డుపెట్టుకున్నారంటే... ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ స్థాయిలో రెచ్చిపోయాడో అర్థంచేసుకోవచ్చు. 

ఒక్క చంద్రబాబుపైనే కాదు... ఆయన కుమారుడు.... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా అనుచిత వ్యాఖ్యలు చేశాడు ద్వారంపూడి. వాడు పప్పు లోకేష్... వాడికి కొవ్వు కరిగేలా కొట్లాలి... బుద్ధి చెప్పాలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ పైనా చెలరేగిపోయాడు. ఇష్టానుసారంగా తిడుతూ ఏదిపడితే పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. పవన్ కల్యాణ్ ఒక దొంగనా కొడుకంటూ రెచ్చిపోయాడు. అంతేకాదు లంజ చేసే పనులన్నీ పవన్ చేస్తున్నాడంటూ అసభ్య పదజాలంతో సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడాడు. 
 
పందులు, కుక్కలు సైతం సిగ్గుపడేలా సభ్యత సంస్కారం వదిలేసి, తానొక ఎమ్మెల్యేనన్న సంగతి కూడా మర్చిపోయి, అధికార పార్టీలో ఉన్నాననే అహంకారంతో... దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై నోటికొచ్చినట్లు పచ్చి బూతులు తిట్టడంపై పార్టీలకతీతంగా తప్పుబడుతున్నారు. ద్వారంపూడి అసలు మనిషేనా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను ముఖ్యమంత్రి జగన్ కూడా ఉపేక్షించకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ ద్వారంపూడి లాంటి లీడర్లను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తే.... తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.