సైలెంట్ గా ఎన్కౌంటర్.. కేసీఆర్ మాటల పొలిటీషియన్ కాదు, చేతల పొలిటీషియన్

 

ఒకప్పుడు ఇండియాని చూసి ప్రపంచదేశాలు స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి అనేవారు. కానీ ఇప్పుడు.. స్త్రీలని గౌరవించలేని దేశంగా, స్త్రీలకు రక్షణ కల్పించలేని దేశంగా.. ప్రపంచదేశాల ముందు తలదించుకునే స్థాయికి దిగజారుగుతోంది పరిస్థితి. దానికి కారణం కొందరు మృగాళ్లు. న్యూస్ ఛానెల్స్, న్యూస్ పేపర్స్ ఓపెన్ చేస్తే చాలు.. ముక్కుమొహం తెలియని వారిదగ్గర నుండి వావివరసలు మరిచినవారి వరకు.. ఇలా ఎందరో స్త్రీలపై అఘాయిత్యాలు చేస్తున్న వార్తలే. అసలు స్త్రీ పట్టపగలు ఇంట్లో ఒంటరిగా ఉండాలన్నా, పట్టపగలు ఒంటరిగా రోడ్ మీద నడవాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఆ భయమే అటు స్త్రీలలో, ఇటు స్త్రీలను గౌరవించే వారిలో ఆవేదన రగిల్చింది. కానీ ఆ ఆవేదన ఆవేశంగా మారడానికి ఎంతో సమయం పట్టదు. ఆవేశంగా మారితే ఫలితం ఎలా ఉంటుందో.. కళ్ళకు కట్టినట్టు చూపించిందే.. దిశా ఘటన నిందితుల ఎన్కౌంటర్.

హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశా అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాత్రి సమయంలో.. స్కూటీ పంచర్ అయ్యింది, సాయం చేస్తామని ఓ ఆడకూతురికి మాయమాటలు చెప్పి.. మృగాళ్లా మీద పడి అత్యాచారం చేసిందే గాక, సజీవ దహనం చేసారు నలుగురు దుర్మార్గులు. ఈ వార్త దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రావేశాలకు కారణమైంది. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లెక్కారు. పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు. ఆ నలుగుర్ని మీరైనా చంపండి లేదా మాకు అప్పగించండి.. మేమే నడిరోడ్డు మీద చంపేస్తాం అంటూ ప్రజలు హెచ్చరించారు. అసలు ప్రజల ఆవేశం చూస్తే జైలు గోడలు బద్దలు కొట్టుకొని వెళ్లైనా ఆ నలుగురు నిందితుల్ని చంపేస్తారేమో అనిపించింది.

ఒకవైపు ప్రజల ఆవేశం ఈ స్థాయిలో ఉంటే.. మరోవైపు దిశా ఘటన విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా స్పదించడం లేదంటూ విమర్శలు వచ్చాయి. మంత్రులు నోరుజారడం.. సీఎం కేసీఆర్ సరిగ్గా స్పందికపోవడం, దిశా కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో విమర్శలు వచ్చాయి. కానీ కేసీఆర్ ని నిన్నటి వరకు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఆ నలుగురు నిందితుల్ని ఎన్కౌంటర్ చేసారు కాబట్టి. కేసీఆర్ దిశా కుటుంబాన్ని పరామర్శించలేదు కానీ దిశా కుటుంబానికి న్యాయం చేసారు. నిందితులకు ఉరిశిక్ష పడి కూతురు ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్న తల్లితండ్రులకు.. నిందితుల ఎన్కౌంటర్ పేరుతో ముందే న్యాయం చేసారు. రాజకీయాల్లో ఒక నానుడి ఉంటుంది. పొలిటీషియన్ అనే వాడు ఎప్పుడూ తనకి నచ్చింది చేస్తూ పోకూడదు. ప్రజల మూడ్ ని బట్టి నడుచుకోవాలి అంటారు. ఇప్పుడు కేసీఆర్ అదే చేసారు. ప్రజల ఆవేశం, ఆవేదన అర్థం చేసుకొని సైలెంట్ ఏం చేయాలో అదే చేసారు. ఆయన సైలెంట్ గా ఉన్నాడని విమర్శించిన వారికి ఎన్కౌంటర్ తో సమాధానం చెప్పారు. ఏదిఏమైనా ఈ చర్య స్వాగతించతగ్గది. ఇంకోసారి ఎవడైనా ఆడవారి మీద చెయ్యి వేయాలంటే.. ఎన్కౌంటర్ పేరుతో కొద్దిరోజుల్లోనే కుక్కచావు చస్తామన్న భయం వాళ్ళకి కలగాలి.