ఐదు గంటల పాటు చిత్రహింసలు పెట్టి ప్రియాంకని కాల్చేశారు!

 

డాక్టర్ ప్రియాంకను హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ ను నిందితులుగా గుర్తించినట్టు సమాచారం. ప్రియాంక స్కూటిని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. నిందితులు నెంబర్ ప్లేట్ తొలగించి స్కూటీని జేపీ దర్గా బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. స్కూటీ దొరికిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ గా అనుమానించారు. లారీ నెంబరు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రియాంక మృతదేహాన్ని చటాన్ పల్లి సమీపంలోని వంతెన కింద పడేసి దహనం చేశారు. మృతదేహం దహనమైన తీరు పోలీసులను కూడా నివ్వెరపరిచింది. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి. మృతదేహం పై పెట్రోల్ పోసి పూర్తిగా కాలిపోయేలా చేసి ఉంటారు అనేది నిపుణుల అంచనా. ప్రియాంక మృతదేహాన్ని జన సంచారం లేని వంతెన కింద పడేశారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని పడేసి కాల్చటానికి చోటు గుర్తించగలిగారు అంటే ఈ ప్రాంతం పై అవగాహన ఉన్నవారే ఇంతటి ఘోరానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. రాత్రి 9:40 నిమిషాల ప్రాంతాల్లో ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన విషయం కుటుంబ సభ్యులు గమనించారు. ఆ సమయంలోనే ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ వైద్యుల అంచనా ప్రకారం రాత్రి మూడు గంటల సమయంలో ఆమె చనిపోయారు. అంటే కిడ్నాప్ అయినప్పటి నుంచి చనిపోయే వరకు మధ్యలో ఉన్న అయిదు గంటల పాటు ఆమెను చిత్ర హింసలు పెట్టి ఉంటారని అర్థమవుతోంది. ప్రియాంక మృతదేహం తలపై చిన్న దెబ్బ ఉన్నట్టుగా గుర్తించారు. ఆమె మెడకు చున్నీ చుట్టి ఉన్న గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హతమార్చి ఉంటారని తెలుస్తొంది.