ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాక్.. బీజేపీ పై డౌట్!!

 

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారంటూ ఉండరు. మనం చేసే ప్రతి పనికి ఫోన్ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాట్సాప్..ఫేస్బుక్..ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియా లొనే సగం జీవితం గడిపేస్తున్నాము. ఇంతకు ముందు ఇంట్లో చొరబడి దొంగలు దోచుకున్నారు అనేవారు.. ఇప్పుడు ఎవరో ఫోన్ హ్యాకింగ్ చేసి నా సమాచారం దోచుకున్నారని అంటున్నారు. సామాన్యుల ఫోన్ లే హ్యాకింగ్ కి గురవుతుంటే..బడా బాబులు.. ముఖ్యనేతల మొబైలను వదులుతారా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్ హ్యాకింగ్ కు గురైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే అది నిజమేనేమో అని సందేహం కలుగుతుంది. 

ఇజ్రాయిల్ కు చెందిన పెగాసన్ స్పైవేర్ సంస్థ కొందరు ఫోన్ లోని వాట్సాప్ లోకి చొరబడింది అన్న వార్తల నడుమ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఇప్పటి వరకూ స్పైవేర్ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్ల లోకి చొరబడిందని.. అందులో ప్రియాంక గాంధీ కూడా ఉన్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. వాట్సాప్ హ్యాకింగ్ కు గురైన వారందరికీ స్పైవేర్ సంస్థ ఒక సందేశం పంపించిందని..అదే సందేశం ప్రియాంక గాంధీకి కూడా పంపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ ఫోన్ లు కూడా హ్యాకింగ్ కి గురైనట్లు కాంగ్రెస్ చెబుతోంది. ఇది బీజేపీ పనేనని ప్రభుత్వమే హ్యాకింగ్ చేయించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. స్పైవేర్ సంస్థ వాట్సాప్ లోకి చొరబడినట్లు స్వయంగా సంస్థనే సోషల్ మీడియాలో వెల్లడించింది. నాయకులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉద్యమ నేతలకు ముప్పు ఉందని.. వీరి ఫోన్లోని సమాచారం ఇతర దేశాలకు చేరే ప్రమాదముందని వాట్సాప్ వెల్లడించింది. ఈ నేపధ్యం లోనే స్పైవేర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.