టి బిల్లుకు ప్రణబ్ ఓకే: రేపు రాజ్యసభకు

 

 

 

తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రేపు 12-30 గంటలకు రాజ్యసభలో కేంద్రప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్రమంత్రులు రాజీవ్ శుక్లా, సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, కమల్‌నాథ్‌లు చర్చలు జరుపుతున్నారు. టి. బిల్లుకు బీజేపీ మద్దతు అవసరం అయిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లా చర్చలు జరుపుతున్నారు.

 

బిల్లు పార్లమెంటుకు రాబోతున్న నేపథ్యంలో బ్రిటిష్ కాలంనాటి విభజించు పాలించు వాసనలు పార్లమెంటులో, రాష్ట్రపతి భవన్ లో కొనసాగుతున్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రపతి సంతకం లేకుండా అఖిలపక్షంలో బిల్లు ప్రతులు పెడితే రాష్ట్రపతి ఎందుకు జోక్యం చేసుకోలేదని పయ్యావుల ప్రశ్నించారు. మా ప్రాంత ప్రజల కష్టాల గురించి పట్టించుకోనప్పుడు ఏం చేసేందుకైనా వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు.