కుట్రపూరితంగానే తమ పై కేసులు మోపారన్న ప్రత్తిపాటి పుల్లారావు...

ప్రత్తిపాటి పుల్లారావు గారి పై చేసిన ఆరోపణలకు స్పందిస్తూ 'సభలో గిరి దాటితే మార్షల్స్ ను పెట్టి బయటపడేయండి అని మాట్టాడిన పదజాలం చాలా అభ్యంతరకరంగా ఉందని చట్ట సభలను గౌరవించాలి కానీ చట్ట సభలకు రావాలంటే భయపడే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిన్న జరిగిన ఈ చట్టసభల్లోనే చూశానని పుల్లరావు వెల్లడించారు.చట్టసభలంటే హుందాతనం ఉండాలి చరిత్రలో చెప్పుకునే విధంగా ఉండాలి కానీ భయపడే పరిస్థితుల్ని అధికార పక్షం కల్పిస్తోందని ఉద్యమంలో వాస్తవాల చూపెడుతున్న మీడియా పై అక్రమ కేసులు పెడుతున్నారని పుల్లారవు వెల్లడించారు'.మండలి లో కూడా ప్రత్యేక్ష ప్రసారాలను నిలిపివేసే ప్రయత్నాలను చేపట్టారని ఎక్కడ వారు చేసే అరాచకాలు బయటికి వస్తాయో అని ఐదు కోట్ల మంది ప్రజలు కూడా చూడకుండా మీరు లైవ్స్ కట్ చేసే ప్రయత్నాలు చేశారు అని పుల్లారవు మండిపడ్డారు.

తన పై వచ్చిన ఆరోపణలకు స్పందిస్తూ నారాయణ గారు కానీ, తాను కానీ ఎప్పుడూ ఎవరి వద్ద నుంచి ఎటువంటి అక్రమ భూములు కానీ, బలవంతపు భూములు కానీ తీసుకోలేదని బుజ్జి అనే ఒక దళితుడ్ని తీసుకువచ్చి కుట్రపూరితంగా తమ పై కేసులు పెట్టించారని వెల్లడించారు.తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని,తాము ఏ తప్పులు చేయలేదు కాబట్టి ఈ కేసులకు బయపడేది లేదని పుల్లారావు తెలియజేశారు.ల్యాండ్ పూలింగ్ చేసినంత కాలం తమ సమక్షంలో లీగల్ ఆర్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏది జరగలేదని,చంద్రబాబు గారి వద్ద మద్యం వాసన వచ్చిందని వస్తున్న ఆరోపణలను గట్టి జవాబునిస్తూ మద్యం అలవాటు ఉండి తాగే వారి దెగ్గిరే మద్యం వాసన వస్తుందని, చంద్రబాబు గారు ఎలాంటి వారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని లేనిపోని ఆరోపణలు చేయడం తగదని పుల్లారావు గట్టి చురకనంటించారు. వైసీపీ సర్కార్ తమ పై చేసిన ఆరోపణలను ఎదురుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుల్లారవు గారు వెల్లడించారు.