'మిర్చి' సినిమా హైలైట్స్

 

 

Prabahs Mirchi, Prabahs Mirchi movie talk, Prabahs Mirchi movie, Prabahs Mirchi highlights

 

 

యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 'మిర్చి' మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రెబెల్ సినిమా ఫ్లాప్ తరువాత ప్రభాస్ తన ఆశలన్నీ 'మిర్చి' సినిమా మీద పెట్టుకున్నాడు. ఈ సినిమా తో మాటల రచయిత కొరటాల శివ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. మరి ప్రభాస్ మిర్చి తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాడో లేదో చూద్దాం.

'మిర్చి' మూవీ హైలైట్స్

"మిర్చి" మూవీ లో ప్రభాస్ మెయిన్ హైలైట్ గా చెప్పవచ్చు. ఈ సినిమాలో డిఫరెంట్ బాడీలాంగ్వేజ్ తో, పంచ్ డైలాగులతో ప్రభాస్ అదరగొట్టాడు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర  మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో చేసిన క్యారెక్టర్ లాగా వున్న, తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు.

సినిమా మొదటి భాగం నేరేషన్ వేగంగా సాగుతూ కామెడీ సన్నివేశాలతో బాగుటుంది. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సినిమా స్టోరీలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో బోర్ తెప్పిస్తాయి.

దర్శకుడు కొరటాల శివ సినిమాలో ఫ్యామిలీ డ్రామాను మిలితం చేస్తూనే మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ యూత్‌కు నచ్చే విధంగా ప్రభాస్ యాక్షన్ హీరో ఇమేజ్‌ను కంటిన్యూ చేసాడు. స్క్రిప్టును కమర్షియల్ వేలో నడిపి హిట్ కొట్టాలనే ప్రయత్నం చేసాడు.

కొరటాల శివ రైటర్ గా మంచి అనుభవం ఉంది కాబట్టి అదరిపోయే డైలాగులు రాసాడు. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి  డూడ్', ‘వీలైతే ప్రేమించు...మహా అయితే తిరిగి ప్రేమిస్తారు', ‘కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవ్వడూ వాడలేడు' లాంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

యాక్షన్ సన్నివేశాల కంపోపింగ్ బాగుంది. ముఖ్యంగా ఈ సీన్లలో కెమెరా వాడిన తీరు బ్రిలియంట్ గా ఉంది. ప్రభాస్ పంచకట్టు ఫైట్ సినిమాలో హైలెట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లెటూరి అందాలను బాగా చూపించారు. అనుష్క సినిమాలో గ్లామర్ ఆరబోసింది. రిచా గంగోపాధ్యాయ్ ఫర్వాలేదనిపించింది.