పోర్న్ సైట్ల నిషేదం.. స్పందించిన వర్మ

 

కేంద్ర ప్రభుత్వం సుమారు 5000 పైగా అశ్లీల వెబ్ సైట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అన్నిటిపై స్పందించి విమర్శలు చేసే విమర్శల వర్మ రాంగోపాల్ వర్మ యధావిధిగానే దీనిమీద కూడా తన శైలిలో స్పందించి ట్వీట్లు పడేశారు. కేంద్ర ప్రభుత్వ పోర్న్ సైట్లపై నిషేదం విధించడమన్నది తిరోగామి చర్య అంటూ.. లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైబ్ సైట్లను నిషేదించినంత మాత్రాన నేరాలు జరగకుండా ఆపలేమని అన్నారు. ఇలా నిషేదించడం వల్ల అది ఇంకా బలం పుంజుకుంటుందని.. వ్యక్తుల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తే అది ఆ దేశ సామాజిక పురోగతిని తిరోగమించేలా చేస్తుందని అన్నారు. పోర్న్‌ సైట్లపై నిషేధం విధించడం కన్నా.. ఆ కంటెంట్‌ తప్పుడు మార్గంలో వెళ్లకుండా ప్రభుత్వం చూడాలన్నారు.