పొన్నాల పేరు ఎక్కడ?

 

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి పైగా ఇతర పార్టీల నేతలు నామినేషన్లు కూడా వేస్తున్నారు.కానీ మహాకూటమి పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించటకపోవటంతో అంత అయోమయంలో పడిపోయారు. అయితే అందరి ఉత్కంఠతలకు తెరదింపుతూ కాంగ్రెస్ పార్టీ 65 మందితో తొలివిడిత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.అయితే అందులో కాంగ్రెస్ సీనియర్ నేత పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు.కొన్నిరోజులుగా పొన్నాల గతంలో ప్రాతినిధ్యం వహించిన జనగామ అసెంబ్లీ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీన్ని ఖండించిన పొన్నాల నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తున్నారు.అయితే పార్టీ తొలి జాబితాలో తన పేరు లేకపోవటంతో పొన్నాల షాక్ కి గురయ్యారు.దీంతో పార్టీ పెద్దలను కలిసేందుకు హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.అయితే జనగామ అసెంబ్లీ స్థానం నుంచి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది.దీనిలో భాగంగానే పొన్నాలకు సీటు ఇవ్వలేదని సమాచారం.రామగుండం నుంచి కోదండరాం బరిలో దింపి జనగామ టికెట్‌ తనకే ఇస్తారని పొన్నాల భావించారు. అయితే ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌ను రామగుండం కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో జనగామ నుంచి కోదండరామే పోటీ చేస్తారనే వార్తలకు బలం చేకూరుతోంది. రెండో జాబితాలోనూ తనకు జనగామ టికెట్‌ దక్కదనే ప్రచారం ఊపందుకోవడంతో పొన్నాల ఢిల్లీ వెళ్లారు.మరి ఢిల్లీ వెళ్లిన పొన్నాలను పార్టీ పెద్దలు బుజ్జగిస్తారో ? లేక టీజేఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చల నేపథ్యంలో ఆ సీటు భర్తీని పక్కన పెట్టారో తెలియాలి అంటే టీజెస్ అభ్యర్థుల జాబితా విడుదల అవ్వాలి లేదా ఢిల్లీ వెళ్లిన పొన్నాల అయినా చర్చల అనంతరం సమాధానం చెప్పాలి.