సీమాంధ్రలో పోలింగ్: వైకాపా దౌర్జన్యకాండ

 

 

 

సీమాంధ్రలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైకాపా నాయకులు పూర్తిగా తెగించేశారు. ఎంతటి దారుణానికైనా వెనుదీయని విధంగా ప్రవర్తిస్తున్నారు. పలువురు నేతలపై వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడి, వాహనాలను ధ్వంసం చేస్తున్నారు.

 

1. జమ్మలమడుగు మండలం గొడెగనూరులో టీడీపీ అభ్యర్థి రామాసుబ్బారెడ్డిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎన్నికల పరిశీలకులు,మీడియా సిబ్బంది పైనా వైసీపీ దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

2. చాపాడు మండలం నక్కలదిన్కెలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. టీడీపీ అభ్యర్థి సుధాకర్‌యాదవ్‌పై దాడి చేసి, వాహనం ధ్వంసం చేశారు.

3. చాపాడు మండలం విదునూరులో స్వతంత్ర అభ్యర్థి పుత్తా సుధాకర్‌యాదవ్ వాహనంపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు.

4. మైదుకూరు మండలం ఎన్..ఎర్రపల్లెలో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి కారుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు.

5. బి.మఠం మండలం కొత్తపల్లెలో వైసీపీ నేతలు వీరంగం సృష్టించారు. టీడీపీ అభ్యర్థి సుధాకర్‌యాదవ్ ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో సుధాకర్‌యాదవ్ కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి.

6. బి.మఠం మండలం చెంచయ్యగారిపల్లెలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.