వరద కాశ్మీర్‌కి కేంద్రం 1000 కోట్ల సాయం... జాతీయ విపత్తు

 

జమ్ము కాశ్మీర్‌ని వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 170 మంది మరణించారు. ఆదివారం నాడు కాశ్మీర్‌లోని ముందు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసిన మోడీ వెయ్యి కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. జమ్ము కాశ్మీర్‌ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మోడీ ప్రకటించారు. రాష్ట్రాలు కాశ్మీర్‌ని ఆదుకోవాలని మోడీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వరదల్లో మరణించినవారి కుటుంబాలకు రెండు లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50 వేల రూపాయల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి అందజేయనున్నట్టు నరేంద్రమోడీ ప్రకటించారు.