కొత్త నోట్ల ఫీచర్లు ఇవే....

 

ప్రధాని నరేంద్రమోదీ పలు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. నల్ల ధనాన్ని నిర్మూలించే చర్యల్లో భాగంగా..రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా రూ.2000 , 500 నోట్లు రానున్నాయి. కొత్తగా వచ్చే ఈ నోట్ల ఫీచర్లు ఏంటంటే..

రూ.2000 నోటు ఫీచర్లు..
*కొత్తగా వచ్చే రెండు వేల నోటు పరిమాణం.. 66ఎంఎఎం గా ఉంటుంది
* నోటు వెనుక భాగంలో మన దేశ అంతరిక్ష పరిశోధనల సత్తాను చాటిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం ఉంటుంది.
*ముందు భాగంలో గాంధీ బొమ్మకు ఎడమవైపు కొంత భాగం పారదర్శక రిజిస్టర్ ఉంటుంది

రూ. 500 నోటు ఫీచర్లు..

* పాత నోటుతో పోలిస్తే.. కొత్త నోటు పరిమాణం, కలర్ అన్నీ కొత్తగా ఉంటాయి
* ఈ నోటు పరిమాణం.. 63ఎంఎం గా ఉంటుంది
* పాత నోటు వెనుక భాగంలో థీమ్ దండి మార్చ్ కాగా.. కొత్త నోటు థీమ్ లో ఢిల్లీలోని ఎర్రకోట బొమ్మ ఉంటుంది
*దీనికి కూడా గాంధీ బొమ్మకు ఎడమ వైపున నోటులో కొంత భాగం పారదర్సక రిజిస్టర్ ఉంది.

కాగా రెండు నోట్లకూ వెనుక స్వచ్ఛ భారత్ లోగో ఉంది.