నగదు రహిత లావాదేవీలకు జనం ముందుకొస్తారా..?

రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం ప్రకటించారు. అంతేకాకుండా ఇకపై బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రాపైనా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో జనం దృష్టి నగదు రహిత లావాదేవీలపై పడింది. నగదు చెలామణి అధికంగా ఉన్న దేశాల్లో మనదేశం ఒకటి. దీనిని తగ్గించేందుకు గట్టి చర్యలు అవసరమని ప్రభుత్వం ఎంతో కాలంగా భావిస్తున్నాయి. అయితే ఇది ఇంకా నోటి మాటగానే ఉంది తప్ప ఈ దిశగా చర్యలు శూన్యం. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, మొబైల్ వ్యాలెట్లు ఎన్ని వచ్చినా ఇంకా 90 శాతం లావాదేవీల్లో పచ్చనోట్లే పెళపెళలాడుతున్నాయి.

ప్రజలు ఇంకా నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడక పోవడానికి ఇవి కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు:

* దేశ జనాభాలో అధికశాతం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉండటం..ఎక్కువ మంది నిరాక్ష్యరాస్యులు కావడం.
* ఇంటర్నెట్, మొబైల్ పేమేంట్స్ తదితర లావాదేవీల్లో మోసాలకు ఆస్కారం ఉండటం, హ్యాకింగ్, సైబర్   దాడుల భయం
* ఎక్కువ మంది ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన లేకపోవడం
* ప్రభుత్వవ వైపు నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం