కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం.. పాల్గొనబోతున్న మోడీ, మన్మోహన్!!

 

కర్తార్ పూర్ కారిడార్ సిద్ధమైంది. సిక్కుల మత గురువు ఐదు వందల యాభైవ జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించబోతున్నారు. నవంబరు ఎనిమిదిన భారత భూభాగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తే మరుసటి రోజు పాకిస్థాన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభిస్తారు.ప్రధాని నరేంద్ర మోడీ కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ ఎనిమిదిన ప్రారంభించబోతున్నారు. డేరా బాబా నానక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించి 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి ఇది.గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మోడీని కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు .రాష్ట్రపతి రామనాథ్ గోవింద్, ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్ పూర్ కారిడార్ గుడ్డ పాకిస్తాన్ లోని గురునానక్ గురుద్వారాకు చేరుకుంటారు,కాగా పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను నవంబర్ తొమ్మిదిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించబోతున్నారు.

సిక్కు గురువు డేరా బాబా గురునానక్ దేవ్ 1469 నవంబర్ ఇరవై తొమ్మిదిన పంజాబ్ లో జన్మించి 1539 సెప్టెంబరు ఇరవై రెండున మరణించారు.ఆయన పుట్టిన, మరణించిన స్థలాలూ రెండు ప్రస్తుతం పాకిస్థాన్ లోనే ఉన్నాయి. ఆయన చివరి రోజుల్ని కర్తార్ పూర్ లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు పధ్ధెనిమిది ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. దీంతో దాన్ని అత్యంత పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు. అటువంటి ఆ రెండు ప్రదేశాలైన డేరా బాబా నాన్నక్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన రహదారి గురునానక్ దేవ్ జయంతి రోజు ప్రారంభం కానుంది.తర్వాతి రోజే పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ ను ప్రారంభించబోతున్నారు మన్మోహన్,ఈ కారిడార్ గుడ్డ భారత్ కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కు వెళ్ళి పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైనా గురుద్వారా సాహిబ్ ను దర్శించుకోనున్నారు.ఇందు కోసం ఎలాంటి వీసా అవసరం లేదని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది.మరోవైపు భారతదేశం నుంచి కర్తార్ పూర్ వెళ్లే తొలి భక్తబృందాల్లో పాల్గొనాలనీ కెప్టెన్ అమరిందర్ సింగ్ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఆహ్వానం పంపించారు.దీంతో పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్ల నున్న తొలి సిక్కుల వృద్ధుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉండబోతున్నారని సమాచారం.