సెనెటర్ భార్యకు సారీ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ...

 

హౌడీ మోదీ కార్యక్రమం అనంతరం సెనెటర్ భార్యకు ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పారు, దాంతో పాటు బెస్ట్ విషెస్ అంటూ ఆమె భర్తతో తానున్న ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ట్రంప్ బృందంలో కీలకంగా ఉన్న సెనేటర్ జాన్ కార్ని హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ రోజు తన భార్య పుట్టిన రోజంటూ మోదీకి ఆయన చెప్పారు. దీనికి స్పందించిన మోదీ సెనేటర్ జాన్ కార్ని భార్యకు వెరైటీగా శుభాకంక్షలు తెలిపారు.

మీ పుట్టినరోజునాడు మీ భర్త నా కార్యక్రమంలో ఉండిపోయినందుకు సారీ అంటూ తన ఉదారతను చాటుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో మోదీ వెరైటీ శుభాకాంక్షలు వైరల్ అవుతున్నాయి. మనసును గెలవడం ఎలాగో మోదీకి తెలుసంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.