షార్ట్ రివ్యూ... అమీర్‌ఖాన్ ‘పీకే’

 

అమీర్‌ఖాన్, అనుష్క శర్మ, బొమ్మన్ ఇరానీ ప్రధాన తారాగణంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ‘పీకే’ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా పోస్టర్లు సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పీకే’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. ఓ టీవీ ఛానల్లో పనిచేసే అనుష్క శర్మకి, ఓ సందర్భంలో పీకే (అమీర్ ఖాన్) పరిచయమవుతాడు. అమీర్ ఖాన్ ఒక గ్రహాంతర వాసి. అమాయకుడు. భూ గ్రహం మీదకు వచ్చి, తిరిగి వెళ్ళడానికి అవసరమైన రిమోట్ కంట్రోల్ పారేసుకుని వెతుక్కుంటూ వుంటాడు. తన రిమోట్ కంట్రోల్ తనకి ఇప్పించమంటూ దేవుడిని బతిమాలుకుంటూ వుంటాడు. అలాంటి అమాయకుడి కేరెక్టర్ తిరిగి తన గ్రహానికి వెళ్ళేలోపు జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా వుంది. అమీర్ ఖాన్, అనుష్క శర్మ నటన అదరగొట్టారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం ఇరగదీశాడు. నో డౌట్.. నిరభ్యంతరంగా ‘పీకే’ సినిమాకి వెళ్ళొచ్చు. ఈ సినిమా చూసి మన టాలీవుడ్ సినిమా ప్రముఖులు తామేం ‘పీకే’స్తుస్తున్నారో కూడా ఆలోచించుకోవచ్చు.