ముషారఫ్‌కి ఉరేస్తారా? షూట్ చేస్తారా?

 

 

 

పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కి ముసించింది. ఆయనగారి బతుకు ముగిపోయే సమయం ఆసన్నమైంది. పాక్ సైన్యాధ్యక్షుడి హోదాలో తిరుగుబాటు చేయడం ద్వారా పాకిస్తాన్‌ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని, దేశాధ్యక్షుడిగా నియంతలా వ్యవహరించిన ముషారఫ్ ప్రస్తుతం అనేక నేరారోపణలు ఎదుర్కొంటూ పాక్‌లో బందీగా వున్నాడు.

 

పాకిస్తాన్‌లో పద్ధతుల ప్రకారం ముషారఫ్ మీద ఆరోపించిన నేరాలు నిరూపణ అయితే ముందూ వెనుకా ఆలోచించకుండా చంపిపారేస్తారు. ప్రస్తుతం ముషారఫ్ గారి నేరాలన్నీ నిరూపణ అయ్యేలా వున్నాయట. ఇక కొద్ది రోజుల్లోనే ముషారఫ్‌ని రఫ్పాడించేసి పైకి పంపించడానికి అక్కడి సైన్యం సన్నాహాలు చేస్తోందట. ముషారఫ్‌ని ఉరి తీస్తారా లేక షూట్ చేసి చంపుతారా అనే డిస్కషన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతోంది.

ముషారఫ్ లాంటి సైనికుడు బుల్లెట్‌ ద్వారా చావడానికి ఇష్టపడతాడు. ఉరి వేయడం అనేది ఒక సైనికుడికి చావుకంటే బాధ కలిగించే విషయం. మనం జాలిపడతాంగానీ, మన దేశంలో ఈ అవకాశం లేదుగానీ, అక్కడ ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకులని అవసరమైతే చట్టప్రకారం చంపేస్తారు. గతంలో జుల్ఫుకర్ అలీ భుట్టోని కూడా అలాగే చంపేశారు. ఇప్పుడు చావుకి దగ్గరైన ముషారఫ్ కూడా తక్కువోడేమీ కాదు.. ఎన్నో వేలమందిని చంపేసిన రఫ్ కేరెక్టర్ ముషారఫ్‌ది. అధికారంలో ఉన్నంతకాలం ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వాడు. పాపం పండి ఇప్పుడు చావుకోసం ఎదురుచూస్తున్నాడు.