ఢిల్లీ నుంచి వ‌చ్చిన ​603 మంది లెక్క తేడాకొడుతోంది!

​ఢిల్లీ లో జరిగిన మతపరమైన ప్రార్ధనలలో 603 మంది పాల్గొని, నగరానికి  తిరిగి వచ్చారు.  ​వారి ఆరోగ్య స్థితిని తనిఖీ చేసేందుకు పోలీస్,  జీ హెచ్ ఎం సి, రెవిన్యూ వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన   200 బృందాలు జి హెచ్ ఎం సి పరిధిలో తనిఖీ చేస్తున్నాయ‌ని జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు.

​అత్యంత పకడ్బందీగా  చేపట్టిన ఈ తనిఖీ ప్రక్రియను  జోనల్ కమీషనర్లు క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేస్తున్నట్లు జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ​జి హెచ్ ఎం సి కమీషనర్ ఆయా జోన్లలో పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. 

​ఈ బృందాలు  కోవిద్ -19 లక్షణాలు కనిపించిన వారిని గాంధీ హాస్పిటల్ కు తరలిస్తున్నాయి. ​ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన వారి  కుటుంబ సభ్యులను కూడా  హోం క్వారెంటైన్ చేస్తున్నాయి .  
​​వృద్దులు, తీవ్రమైన రోగాలతో బాధపడుతున్న వారిని, ఇండ్లలో తక్కువ స్థలం వున్న వారిని ప్రభుత్వ క్వారంటైన్కు తరలిస్తున్నాయి.

​నేడు  463 మంది ఇండ్లను తనిఖీ చేశారు. వారిలో 74 మందికి ఆరోగ్య సమస్యలు, కరోనా లక్షణాలు కనిపించుటతో పరీక్షల నిమిత్తం గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్ కు తరలించారు. ​348 మందిని హోం క్వారెంటైన్ చేయగా, మరో 41 మందిని ప్రభుత్వ క్వరెంటైన్ కు తరలించారు.  ​మిగిలిన వారి అడ్రసులు సరిగా లేనందున,వారి ఆచూకీకీ  వాకబు చేస్తున్నారు.