బలంగా వినిపిస్తున్న సమైక్యగాణం

 

కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రత్యేక తెలంగాణ దిశగా అడుగులు వేస్తుండటంతో రాష్ట్రంలో సమైఖ్యగాన్ బలంగా వినిపిస్తుంది.. ఇన్నాళ్లు ఎలాంటి స్టేట్‌మెంట్‌లు ఇవ్వని నాయకులే కాదు.. తెలంగాణ ఇచ్చిన పర్లేదు అన్న బోత్సా లాంటి నాయకులు కూడా ఇప్పుడు యు టర్న్‌ తీసుకున్నారు.

తెలంగాణ ఎర్పాటుకు రోడ్‌ మ్యాప్‌ సిద్దం చేయాలంటూ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ సియం,పిసిసీ చీఫ్‌లను కోనడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. చాలా రోజులు స్థబ్ధుగా ఉన్న సమైఖ్య వాదులు మళ్లీ గళం విప్పారు..

ఇప్పటికే రాయలసీమ వైఎస్‌ఆర్‌ సిపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్సీ షేక్‌ హుస్సేన్‌ కూడా రాజీనామ చూశాడు..

రాష్ట్రం సమైఖ్యం ఉంచాలని కోరుతూ ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థి జేఎసి, పురందరేశ్వరికి చీర సారే తో పాటు, సుబ్బిరామిరెడ్డికి కమండలం,రుద్రాక్షలు పంపి నిరసన తెలిపారు..

ఇదిలా ఉంటే టికాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ఏర్పాటుకు సర్వం సిద్దం అయిందంటుంటే.. సీమాంద్రనాయకులు మాత్రం రాష్ట్ర పరిస్థితుల్లోనూ విడిపోయే ప్రసక్తి లేదంటున్నారు.. ఈ నేపధ్యంలో సియం, పిసిసి చీఫ్‌లకు అధిష్టానం నుంచి పిలుపు రావడం ప్రదాన్యత సంతరించుకుంది.. ఈ నెల 12న జరగబోయే కోర్‌కమిటీ బేటిలో తెలంగాణ విషయాన్ని తేల్చేస్తాం అంటున్నా కాంగ్రెస్‌ ఎంత వరకు మాట నిలుపుకుంటుందో చూడాలి..