విభజన ఆగదు : చాకో

 

సీమాంద్రలో పరిస్థితులు ఎలా ఉన్నా కాంగ్రెస్‌ మాత్రం తన నిర్ణయం నుంచి వెనక్కి వెల్లటానికి సిద్దంగా ఉన్నట్టుగా కనిపిచటం లేదు. నలుగురు సభ్యులతో ఆంటోని నేతృత్వంలో కమిటీ వేసిన అధిష్టానం, ఆ కమిటీ కేవలం సీమాంద్రుల అపోహలు నివృత్తి చేయడానికి మాత్రమే అని తేల్చి చెప్పింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు మళ్లే  ప్రసక్తే లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో స్పష్టం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న ఉధ్యమం పై కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరితో ఉంది అన్న చాకో కమిటీ కేవలం సీమాంద్రులు అభిప్రాయ సేకరణ కు మాత్రమే అని చెప్పారు.

ఆంటోని నేతృత్వంలోని కమిటీ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అమలులోఎదురయ్యే సమస్యలపై  చర్చించి, తగిన పరిష్కారాలను మాత్రామే సూచిస్తుందన్నారు. కమిటీ ద్వార అభిప్రాయ సేకరణ మాత్రమే ఉంటుందన్న ఆయన దీని ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం లేదన్నారు.