కేరళకు పేటీఎం అధినేత పదివేలు విరాళం.. ఎంత గొప్ప మనస్సో

భారీ వర్షాలు, వరదలు కారణంగా కేరళలో ప్రాణ నష్టంతో పాటు, భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది.. కేరళను ఆదుకునే అందుకు దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి సంపన్నుల వరకు అందరూ ముందుకొస్తున్నారు.. సామాన్యులు ఇచ్చే వందల నుండి, సంపన్నులు ఇచ్చే లక్షలు, కోట్లు వరకు ప్రతి రూపాయి కేరళకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది.. అందుకే సామాన్యులు తమకి తోచిన సాయం వందలు, వేలు చేస్తున్నారు.. కానీ ఓ సంపన్నుడు కూడా సంపదలో తాను సామాన్యుడిని అనుకున్నట్టున్నాడు.. వేలకోట్ల ఆస్తి ఉండి, వేలల్లో విరాళం ఇచ్చాడు.. ఆయన ఎవరో కాదు పేటీఎం అధినేత విజయ్ శేఖర శర్మ.

 

 

సుమారు 12 వేల కోట్లు ఆస్తి ఉన్న ఈయన, కేరళకు కేవలం పదివేల రూపాయిలు విరాళం అందించారు.. ఈ విరాళానికి సంబంధించిన రసీదును ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.. అంతేకాదు విరాళాలను ఇచ్చేందుకు తమ పేటీఎంను వాడుకోవాలని పిలుపునిచ్చారు.. ఇంకేముంది నెటిజన్లకు ఆయన మీద కోపం కేరళ వరదల్లాగా కట్టలు తెంచుకుంది, ఆయన మీద విమర్శల వర్షం కురిపించారు.. సమాజంలో నీ స్థాయి ఏమిటి? నీవిచ్చే విరాళం ఏమిటి? అంటూ కొందరు.. జనాల సొమ్ముతో రూ.12 వేల కోట్లు సంపాదించి ఇప్పుడు అదే జనాలకు రూ.10 వేల ముష్టి వేస్తావా? అంటూ కొందరు మండిపడ్డారు.. అత్యంత ధనవంతుడైన విజయ్ శేఖర్ రూ.10వేల విరాళంగా ఇచ్చి, పేటీఎం ప్రచారం చేసుకుంటున్నారని మరి కొందరు విమర్శలు గుప్పించారు.. విమర్శకుల దెబ్బకు విజయ్ శేఖర్ శర్మ వెంటనే ట్విట్టర్ నుంచి ట్వీట్ ను తొలగించారు.. కానీ, అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజెన్లు దానిని వైరల్ చేశారు.. వేల కోట్లు ఆస్తి ఉండి వేలల్లో విరాళం ఇచ్చి.. పిసినారులందు పేటీఎం అధినేత వేరయ్యా అనిపించుకుంటున్నారుగా.